నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

పటాన్‌చెరు టౌన్‌: భద్రతా పరంగా సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అమీన్‌పూర్‌ సీఐ నరేష్‌ అన్నారు. శుక్రవారం అమీన్‌న్‌పూర్‌ పరిధిలోని కిష్టారెడ్డిపేట చౌరస్తాలో రాజన్న టీ కొట్టు నిర్వాహకుడు స్వచ్ఛందంగా నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాటిని సీఐ నరేష్‌ ప్రారంభించి మాట్లాడారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి చర్యలు ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా రహదారిపై వాహనాల రాకపోకలు స్పష్టంగా కనిపించే విధంగా కెమెరాలను అమర్చడం అభినందనీయమన్నారు. సమాజ భద్రతకు ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement