వాళ్లు నాటుతున్నారు.. వీళ్లు నరికేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

వాళ్లు నాటుతున్నారు.. వీళ్లు నరికేస్తున్నారు!

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

రాంతీర్థ్‌–బీదర్‌ రోడ్డు మార్గంలో పచ్చని చెట్లను నరికివేసిన దృశ్యం

అల్లాదుర్గం–మెటల్‌కుంట రోడ్డు పక్కన ఆహ్లాదకరంగా చెట్లు

న్యాల్‌కల్‌ మండలంలో హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని జిల్లా అధికారులు ఆదేశించడంతో కింది స్థాయి సిబ్బంది మొక్కలు నాటుతున్నారు. అంతేకాదు నాటిన మొక్కలు ఏపుగా పెరిగే వరకు నీటిని అందించి సంరక్షిస్తున్నారు. దీంతో రోడ్ల కిరువైపులా రాకపోకలు సాగించే వారికి ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత విద్యుత్‌ తీగలకు తాకుతున్నాయనే కారణంతో ఆ శాఖ సిబ్బంది వాటిని విచ్చలవిడిగా నరికివేస్తున్నారు. దీంతో మొక్కలను సంరక్షించిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – న్యాల్‌కల్‌(జహీరాబాద్‌):

Advertisement
 
Advertisement
Advertisement