వేసవి.. ఆట విడుపు | - | Sakshi
Sakshi News home page

వేసవి.. ఆట విడుపు

May 1 2026 8:08 AM | Updated on May 1 2026 8:08 AM

నేటి నుండి జూన్‌ 7 వరకు స్పోర్ట్స్‌ క్యాంపుల నిర్వహణ ఒక్కో క్రీడకు ఒక్కోరకమైన ఫీజు

నేటి నుండి జూన్‌ 7 వరకు స్పోర్ట్స్‌ క్యాంపుల నిర్వహణ

సంగారెడ్డి జోన్‌: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు రావడంతో విద్యార్థులకు ఆటవిడుపుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శిబిరాలను ఏర్పాటు చేసింది. విద్యతోపాటు క్రీడల్లో రాణించేందుకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించనుంది. ఈ క్రీడా శిబిరాలు ప్రతీరోజు ఉదయం 6గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటలనుంచి 7 గంటల వరకు నిర్వహిస్తారు. 14 ఏళ్ల లోపు ఉన్న బాల, బాలికలకు 34 రకాల క్రీడల్లో కోచింగ్‌ ఇవ్వనున్నారు.

గ్రామీణ ప్రాంతాలో10.. పట్టణాల్లో 14

గ్రామీణ ప్రాంతాల్లో 10, పట్టణాల్లో 14 సమ్మర్‌ కోచింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే వీటికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 1 నుంచి జూన్‌ 7 వరకు విద్యార్థులకు క్రీడలలో కోచింగ్‌ ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణనిచ్చే నిర్వాహకులకు రూ.5 వేలు గౌరవ వేతనంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్‌ అందజేయనున్నారు.

సంగారెడ్డిలో కోచింగ్‌ కేంద్రం ప్రారంభం

సమ్మర్‌ కోచింగ్‌ నిర్వహణలో భాగంగా గురువారం సంగారెడ్డిలో కిక్‌ బాక్సింగ్‌ కోచింగ్‌ను ప్రారంభించారు. జిల్లా యువజన క్రీడాధికారి అఖిలేశ్‌రెడ్డి ప్రారంభించి నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు అందించారు.

సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులు క్రీడారంగంలో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేసవికాలం క్రీడా శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ఆసక్తి ఉన్న ప్రతీ విద్యార్థి కోచింగ్‌ తీసుకుని సద్వినియోగం చేసుకోవాలి. క్యాంపులలో పీడీలతోపాటు కోచ్‌లను నియమించడం జరిగింది.

–అఖిలేశ్‌రెడ్డి, జిల్లా యువజన క్రీడా అధికారి, సంగారెడ్డి

జిల్లావ్యాప్తంగా 24 కేంద్రాల ఏర్పాటు

34 రకాల క్రీడల్లో కోచింగ్‌

సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు

పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే వారికి ఎలాంటి గౌరవ వేతనం ఉండదు. క్రీడలు నిర్వహించే వారికి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయనున్నారు. ఒక్కో క్రీడకు ఒక్కో రకమైన ఫీజులు నిర్ణయించారు. అథ్లెటిక్స్‌, బాస్కెట్‌ బాల్‌, జిమ్నాస్టిక్స్‌, ఉషులకు రూ.400, ఆర్చెరీ, బాల్‌ బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, కరాటే, ఖోఖో, సెల్ఫ్‌ డిఫెన్స్‌, సాఫ్ట్‌బాల్‌, హాకీ, టెన్నికోయిట్‌, త్రో బాల్‌, నెట్‌బాల్‌లకు రూ.200, వాలీబాల్‌, రెజ్లింగ్‌, తైక్వాండోలకు రూ.100, బ్యాడ్మింటన్‌, స్విమ్మింగ్‌, రూ.1000, లా టెన్నిస్‌ రూ.1,200, టేబుల్‌ టెన్నిస్‌ రూ.700, చెస్‌, మల్టీజిమ్‌, ఫుట్‌బాల్‌, ఫెన్సింగ్‌ రూ.300, కబడ్డీ, వెయిట్‌ లిఫ్టింగ్‌లకు రూ.150 లుగా నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement