● ఒక్కరోజే రూ.2.28 కోట్ల ఆస్తి పన్ను వసూలు
● ఈ ఏడాది మొత్తంగా రూ.27.18 కోట్లు పన్ను రాబడి
జిన్నారం (పటాన్‌చెరు): పట్టణ పరిధిలో ఆస్తి పన్నుల చెల్లింపులో భాగంగా ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్ స్కీం గడువు గురువారంతో ముగిసింది. చివరి రోజున పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ఆస్తిపన్ను బకాయిలను 5% రిబేటుతో చెల్లించారు. డిప్యూటీ కమిషనర్ ప్రదీప్‌కుమార్‌కు ఆస్తి పన్నులను చెక్కుల రూపంలో అందజేశారు. పారిశ్రామికవేత్తలు వివిధ వ్యాపారులు ఈ స్కీం ద్వారా అవగాహన పొంది చెల్లింపులు చేశారు. హిందుస్థాన్ కోకోకోలా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ రూ.85.77 లక్షలు, రానే మద్రాస్ పరిశ్రమ రూ.9.78 లక్షలు, టియానిష్ లేబోరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ రూ.3.30 లక్షలు, రాహి ట్రాక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ రూ.3.19 లక్షలు, పటేల్ హీరోయిన్ దశరథ్ రూ.19.44 లక్షలు ఆస్తి పన్నును చెల్లించాయి. మొత్తం రూ.2.28 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. గతేడాది రూ.24.71 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయగా ఈ ఆర్థిక సంవత్సరం 10% టార్గెట్ తో కలిపి మొత్తం రూ.27.18 కోట్లు ఆస్తి పన్నును ఎర్లీ బర్డ్ పథకం కింద వసూలు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో ఏఎంసీలు మనోహర్, నర్సింహులు, మల్లికార్జున స్వామి, సాయిలు, శ్రీధర్, బిల్ కలెక్టర్లు, అసిస్టెంట్ బిల్ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


