నారాయణఖేడ్: ఖేడ్ ప్రాంతంలో వరుసగా నాలుగవ రోజు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఖేడ్ పట్టణంలో నాలుగు పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ, ప్రతీ రోజు ఏదో ఒక బంకులో మాత్రమే డీజిల్, పెట్రోల్ ఉంటుంది. అధికారులు పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతున్నప్పటికీ, ఏదో ఒక పం పులో మాత్రమే అందుబాటులో ఉంటుండటంతో వాహనదారులు తెల్లవారు జాము నుంచే ఆయా బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఉన్న పంపుల్లో డీజిల్, పెట్రోల్ ఉండటం లేదు. పెట్రోల్ కొరత ఉత్పన్నమవుతుండటంతో పరిసర గ్రామాల వ్యాపారులు పెద్ద డబ్బాల్లో పెట్రోల్, డీజిల్‌ను నింపుకెళ్తున్నారు.


