నిరుపేదలకు ఉచిత న్యాయ సేవలు | - | Sakshi
Sakshi News home page

నిరుపేదలకు ఉచిత న్యాయ సేవలు

May 1 2026 4:04 AM | Updated on May 1 2026 4:04 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర

సంగారెడ్డి టౌన్‌: ఉచిత న్యాయ సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. జిల్లా కోర్టులో పారా లీగల్‌ వాలంటరీలకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో పారా లీగల్‌ వాలంటరీలు తిరిగి పేదవారికి న్యాయ సేవలను అందించాలని సూచించారు. వరకట్న నిషేధం, బాల్య వివాహాలు నిషేధ చట్టంపై ఉచిత సేవలు అందించేందుకు శిక్షణను వినియోగించుకోవాల న్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సంజీవరెడ్డి, న్యాయవాదులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సాగు ప్రోత్సాహకాలు

సద్వినియోగం చేసుకోవాలి

వ్యవసాయ శాస్త్రవేత్తలు

సంగారెడ్డి టౌన్‌: రైతులు సాగు ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు శాంతి, గీత పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని దాసు గడ్డ తండా గ్రామంలో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ...రైతులు పరిమితంగా ఎరువులను వాడాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించాలని, సేంద్రియ ఉత్పత్తులను తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. రైతులు ఎరువులను కొనేటప్పుడు తప్పనిసరిగా రశీదులను పొందాలని, శాసీ్త్రయ పద్ధతిలో పంటలను పండించాలన్నారు.

పరిహారం ఇవ్వలేకే

అసత్య ఆరోపణలు

కోదండరెడ్డి ఆరోపణలపై

మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

కంగ్టి(నారాయణఖేడ్‌): భూముల వ్యవహారంలో ధరణి పోర్టల్‌లో అక్రమాలు జరిగాయని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి నిరాధార ఆరోపణలపై ఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రస్థాయి వ్యక్తి గత ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. మండలంలోని తడ్కల్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేక ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తుందని దుయ్యబట్టారు. కంగ్టి మండలంలోని గాజుల్‌పాడ్‌ గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు మాధవరావు కుటుంబానికి పరామర్శ కోసం వచ్చిన కోదండరెడ్డి ధరణి పోర్టల్‌ ప్రారంభం కాకముందే జరిగిన ఘటనలో అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. రైతులకు భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కొనే ప్రయత్నం చేస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు.

నేటి నుంచి మెథడిస్ట్‌

చర్చి జాతర

జహీరాబాద్‌: జహీరాబాద్‌ పట్టణంలోని అల్లీపూర్‌లో బి.జి.గార్డెన్‌ మెమోరియల్‌ మెథడిస్ట్‌ చర్చి జాతర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 1నుంచి 3వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని పేర్కొన్నారు. తొలిరోజు సాయంత్రం 6గంటల నుంచి జెండాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. 2న ఉదయం 10 గంటల నుంచి ఆరాధన, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆటల పోటీలు, సాయంత్రం ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. రాత్రి 9గంటల నుంచి భజన పోటీలు, బుర్రకథ, చలనచిత్ర ప్రదర్శన ఉంటుందన్నారు. 3న ఉదయం 10 గంటలకు ఆరాధన, రోగుల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement