రామచంద్రాపురం(పటాన్‌చెరు): అనుమతుల్లేని ఆర్‌ఎంసీ ప్లాంట్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెల్లాపూర్ నైబర్ హూడ్ అసోసియేషన్ సభ్యులు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనకు విజ్ఞప్తి చేశారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉర్జీత్ విలాస్స్‌లో గురువారం సృజన వివిధ కాలనీవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ నైబర్ హూడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెనా సభ్యులు మాట్లాడుతూ..ఇంటి పన్ను విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రేడియల్ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. అనంతరం తెల్లాపూర్ సొసైటీ చైర్మన్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ 20వేల లీటర్ల త్రాగునీటి ఉచితంగా ఇవ్వాలని అధికారులను కోరారు. ఇందుకు సృజన సానుకూలంగా స్పందించారు.
సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్‌సృజనకు స్థానికుల వినతి


