ప్రతీ ఏటా సాగు చేస్తున్నా | - | Sakshi
Sakshi News home page

ప్రతీ ఏటా సాగు చేస్తున్నా

May 1 2026 4:04 AM | Updated on May 1 2026 4:04 AM

ప్రతి ఏటా చేమదంప పంటను సాగు చేస్తున్నాను. నా వాహనం ఉండటంతో హైదరాబాద్‌ మార్కెట్‌కు తరలించుకుని లబ్ధి పొందుతున్నా. జీఐ ట్యాగ్‌ లభించడం వల్ల పంటకు మంచి డిమాండ్‌ వస్తుందనుకుంటున్నాను.

– జి.కిష్టన్న, రైతు–సజ్జాపూర్‌

పంట సాగు పట్ల ఆసక్తి

గిట్టుబాటు ధర లభించక పోవడం, పెట్టుబడులు పెరగడం వల్ల పలు కారణాల చేత రెండేళ్ల కాలంగా చేమదుంప సాగుకు దూరంగా ఉన్నాను. జీఐ రిజిస్ట్రీ ఆమోదం లభించినందున పంటకు మంచి డిమాండ్‌ ఉండే అవకాశం ఉంది. దీంతో జూన్‌లో పంటను సాగు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా.

– పి.అశోక్‌రెడ్డి, రైతు–సజ్జాపూర్‌

ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం

చేమదుంప పంట సాగుకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందిస్తాం. దీన్ని ఇక ముందుకూడా కొనసాగిస్తాం. రైతులు లబ్ధిపొందాలి. – సోమేశ్వరరావు,

జిల్లా ఉద్యానవన అధికారి–సంగారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement