పటాన్‌చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి బాలాజీ రావు డాక్టరేట్‌కు అర్హత సాధించారు. ‘భారత అణు ఇంధన సబ్–అసెంబ్లీ తయారీ ప్రక్రియలో ఉపయోగించే యురేనియం, జిర్కోనియం ఆధారిత మిశ్రమ లోహాలు, ఉక్కు రసాయన లక్షణాల నిర్ధారణకు కొత్త విశ్లేషణాత్మక అనువర్తనాల అభివృద్ధికి అధ్యయనం’ చేసి, ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ నాగేంద్ర కుమార్ తెలిపారు. కాగా ఆయనను అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం తదితరులు అభినందించారు.


