జూన్‌ నుంచి అల్పాహారం | - | Sakshi
Sakshi News home page

జూన్‌ నుంచి అల్పాహారం

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి

పటాన్‌చెరు టౌన్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో జూన్‌ నుంచి అల్పాహారం అందించనున్నారు. ఈ మేరకు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి వెల్లడించారు. పటాన్‌చెరు పీవీ నరసింహారావు ఆడిటోరియంలో మంగళవారం నియోజకవర్గస్థాయిలో నిర్వహించిన అంగన్‌వాడీ గ్రాడ్యుయేషన్‌ దినోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేటు సంస్థల కంటే అంగన్‌వాడీలో చిన్నారులకు మెరుగైన ఎదుగుదల ఉంటుందని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. చిన్నారులు ఎదగా లంటే అంగన్‌వాడీలకు పంపాలని ఆమె చెప్పారు. అంగన్‌వాడీల్లో చిన్నారులకు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇంద్రేశం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రమీల, సీడీపీఓలు జయ రాం నాయక్‌, పల్లవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement