జోగిపేట(అందోల్): జోగిపేటలోని సబ్‌జైలులో విదేశీ ఖైదీలకు ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోంను మంగళవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. సోమవారం 12 మంది విదేశీ ఖైదీలను ట్రాన్సిట్ హోంకు తరలించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని వివిధ రకాల నేరాలకు పాల్పడి తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ట్రాన్సిట్ హోంకు తరలించారు. వారికి సౌకర్యంగా ఉందా? లేదా అన్న విషయాన్ని స్వయంగా తెలుసుకునేందుకు ఎస్పీ పరిశీలించారు. విదేశీ నేరస్తులను కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలను జైలులో రిమాండ్‌లో ఉంచారు. ఇది తమ పరిధిలోకి రాదని ప్రత్యేకంగా హైదరాబాద్ ఆ విభాగానికి చెందిన అధికారులు పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు.


