వెల్దుర్తి (తూప్రాన్): రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఆరేగూడెం గ్రామశివారులో చోటుచేసుకుంది. ఎస్సై రాజు వివరాల ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన మర్కంటి శంకర్(35) బైకుపై వెల్దుర్తి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అరేగూడెం గ్రామశివారులోని డంప్‌యార్డు సమీపంలో అందుగులపల్లి నుంచి వెల్దుర్తికి వస్తున్న అక్కమొల్ల వినేశ్, శంకర్ బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శంకర్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శంకర్ బైక్ పై ఉన్న మర్కంటి శ్రీనివాస్, వినేశ్ బైకుపై ఉన్న నీరుడి పద్మ, నీరుడి రాజమణిలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుడు శంకర్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కాగా రోడ్డుపై ఆరబోసిన ధాన్యం వల్లే ప్రమాదం జరిగిందని మృతదేహన్ని తరలించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరికి ఆరేగూడెం గ్రామస్తుల హామీ మేరకు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు.


