కేజీబీవీ పిలుస్తోంది.. | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీ పిలుస్తోంది..

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

ఆంగ్ల మాధ్యమంలో బోధన

ఆరో తరగతి అడ్మిషన్లు ప్రారంభం

జిల్లాలో 23 పాఠశాలలు

దుబ్బాకటౌన్‌: పేద, వెనుకబడిన, మధ్యలో బడి మానిన బాలికలకు విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)లను ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు లేని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులకు ఉన్నత చదువులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ మండల కేంద్రంలో వీటిని ప్రారంభించింది. చదువుతో పాటు క్రమశిక్షణ, సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ, ఇంటర్‌ వరకు బోధన అందిస్తున్నారు. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఆరో తరగతిలో..

జిల్లాలో మొత్తం 23 కేజీబీవీలు ఉన్నాయి. ఇప్పటికే ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఏమైనా ఖాళీలు ఉంటే ప్రవేశాలు కల్పిస్తున్నారు. పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్లు తీసుకుంటున్నారు.

ఆంగ్లంలో బోధన

పాఠశాలలో విద్యార్థినులకు పలు వసతులు కల్పించడం, మెనూ ప్రకారం ఆహారం, నాణ్యమైన విద్య, ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు వస తితో కూడిన విద్యను అందిస్తున్నారు. దీంతో ఈ పాఠశాలలు నిరుపేద బాలికలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులతోపాటు నైపుణ్యాలతో కూడిన విద్యను బోధిస్తున్నారు. భవిష్యత్‌లో విద్యార్థులకు ఉపాఽధి అవకాశాలు పొందేలా కుట్లు, అల్లికలతో పాటు ఇతర అంఽశాలను సైతం నేర్పిస్తున్నారు. వివిధ రకాలు వృత్తి విద్యాకోర్సులు సైతం అమలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement