నలుగురిపై కేసు నమోదు
నర్సాపూర్: అడవి పందులు పట్టి అమ్మడానికి ప్రయత్నించిన వ్యక్తితో పాటు కొనుగోలు చేయడాని వచ్చిన వ్యక్తులపై కేసు నమోదైంది. స్థానిక ఎఫ్‌ఆర్వో దివ్య వివరాల ప్రకారం... శివ్వంపేట మండలంలోని గోమారం గ్రామాని కి చెందిన సహదేవ్ నవాపేట గ్రామ శివారులో మూడు అడవి పందులను పట్టుకున్నాడు. వీటి ని నిజాంపేట గ్రామానికి చెందిన సురేశ్, విఘ్నే శ్, ప్రవీణ్‌లకు అమ్మడానికి ప్రయత్నించాడు. అమ్మకానికి పెట్టిన మూడింటిలో ఒకటి చనిపోగా, మిగిలిన రెండింటిని అడవిలో వదిలేశామని అధికారులు తెలిపారు. కాగా అడవి పందులు పట్టిన సహదేవ్‌తో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన ముగ్గురిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
న్యాల్‌కల్(జహీరాబాద్): అక్రమంగా ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్న లారీని మంగళవారం హద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. హద్నూర్ ఎస్‌ఐ సుజిత్ కథనం ప్రకారం... మండల పరిధిలోని ముంగి చౌరస్తా వద్ద ఉదయం ఎస్‌ఐ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి కర్నాటక బీదర్‌కు వెళ్తున్న ఇసుక లారీని తనిఖీ చేశారు. ఆ లారీకి కరీంనగర్ నుంచి జహీరాబాద్ వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వెళ్తుండటంతో పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
బెజ్జంకి(సిద్దిపేట): అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును మంగళవారం టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్ సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు మండలంలోని దాచారం శివారులోని కాలువ సమీపంలో నిల్వ చేసిన ఇసుక డంపును సీజ్ చేశారు. అలాగే బెజ్జంకి, దాచారం కాలువ సమీపంలో నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించామని ఎస్‌ఐ సౌజన్య తెలిపారు. ట్రాక్టర్ నడుపుతున్న చిలాపూర్‌కు చెందిన బొట్ల ప్రవీణ్‌పై కేసునమోదు చేశామని, అక్రమ ఇసుక డంపు వద్ద పోలీస్ బందోబస్తు పెట్టినట్లు తెలిపారు.
పాపన్నపేట(మెదక్): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నాగ్సాన్‌పల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన కాగితాల జహంగీర్(39)ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి కొద్ది పాటి అప్పులున్నాయి. అయితే ఇటీవల మద్యానికి అలవాటు పడ్డాడు. సోమవారం రాత్రి ఓ విందులో పాల్గొని, మద్యం తాగి వచ్చిన అతడు ఇంటి బయట పడుకొని అప్పుల విషయమై ఆందోళన చెందాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఉదయం అటుగా వెళ్లిన రైతులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యం మత్తులో ఒకరు..
మిరుదొడ్డి(దుబ్బాక): మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని చెప్యాలలో చోటు చేసుకుంది. మంగళవారం ఎస్‌ఐ సమత కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బైండ్ల యాదగిరి (42) కూలీ పనులు చేసుకుంటూ భార్య రజిత,పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో యాదగిరి మద్యానికి బానిసగా మారాడు. కుటుంబ పోషణతో పాటు, తాగడానికి అందరి దగ్గర అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో అప్పులిచ్చిన వారి నుంచి వత్తిడి ఎక్కువైంది. దీంతో మద్యం మత్తులో ఇంట్లో ఉన్న దూలానికి ఉరివేసుకున్నాడు.


