దేశాభివృద్ధికి జనగణన కీలకం | - | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధికి జనగణన కీలకం

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు

సొంతూరులో స్వీయగణన

దుబ్బాక: దేశ సర్వతోముఖాభివృద్ధికి జనగణన కీలకమని ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం తన స్వగ్రామం భూంపల్లి–అక్భర్‌పేట మండలం బొప్పాపూర్‌లో స్వీయగణనలో తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జనగణన, కులగణనలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ప్రజలు జనగణనలో తమ కుటుంబానికి సంబంధించి కచ్చితమైన సమాచారం అందించాలని సూచించారు. ప్రజల నుంచి సేకరించే ప్రతి సమాచారం, దేశ భవిష్యత్త్‌తో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్‌ భారత్‌ స్వప్నాన్ని సాకారం చేయడంలో ప్రధానపాత్ర ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బొప్పాపూర్‌ సర్పంచ్‌ భానుప్రసాద్‌, తహసీల్దార్‌ బాల్‌రాజు, ఎంపీడీవో సోమిరెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement