గుర్తుతెలియని మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

చేగుంట(మెదక్‌): మండల పరిధిలోని బి.కొండాపూర్‌ చెరువు మత్తడిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... స్థానికులు చెరువు వద్ద మృతదేహం కనిపించిందని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు పంచనామ నిర్వహించారు. మృతి చెందిన వ్యక్తికి 40 సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. మృతుడికి సంబంధించిన వారు పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సింగూరు ప్రాజెక్టు వద్ద గోనె సంచిలో..

పుల్‌కల్‌(అందోల్‌): సింగూరు ప్రాజెక్టు జెన్‌కో నీటి ప్రవాహం వద్ద గోనె సంచిలో కట్టిపడేసిన గుర్తు తెలియని మృతదేహం లభించింది. పుల్‌కల్‌ ఎస్‌ఐ విశ్వజన్‌ కథనం ప్రకారం... మృతుడికి 40 నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగి, 5.5 మీటర్ల ఎత్తు, చామన చాయ కలిగి ఉన్నాడు. ఈ వ్యక్తిని మూడు,నాలుగు రోజుల క్రితమే హత్య చేసి శ వాన్ని సింగూరు జెన్‌కో వద్ద పడవేశారని అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement