● 100 మంది మహిళా రైతుల జీవవైవిధ్య విత్తన ప్రదర్శన
జహీరాబాద్: ప్రపంచ విత్తన దినోత్సవాన్ని పురస్కరించుకుని డెక్కన్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జీవవైవిధ్య విత్తన ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. పస్తాపూర్ గ్రామంలోని సంస్థ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 45 గ్రామాలకు చెందిన 100 మంది డీడీఎస్ మహిళా రైతులు చిరుధాన్యాల విత్తనాలతోపాటు సాంప్ర దాయ విత్తనాలు ప్రదర్శించారు. అత్యధికంగా 57 రకాల విత్తనాలను ప్రదర్శించిన నాగ్వార్ గ్రామ మహిళా రైతులకు ప్రథమ బహుమతి అందజేశారు. 56 రకాలు ప్రదర్శించిన గుంజోటి గ్రామ రైతులకు ద్వితీయ బహుమతి, 55 రకాలు ప్రదర్శించిన బిడకన్నె రైతులకు తృతీయ బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ భిక్షపతి, డీడీఎస్ ఈడీ దివ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.


