రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన తెలిపారు. సోమవారం రామచంద్రాపురం డివిజన్‌లో క్షేత్రస్థాయిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా రాయసముద్రం చెరువును సందర్శించారు. చెరువు అభివృద్ధికి కావాల్సిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాకతీయనగర్ కాలనీలోని థీమ్ పార్కును సందర్శించారు. కాలనీవాసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 76వార్డులలో ప్రతివారం కాలనీలోని సమస్యను తెలుసుకునేందుకు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ సర్కిల్ ఉపకమిషనర్ ప్రదీప్ కుమార్, మాజీ కార్పొరేటర్ బి.పుష్ప తదితరులు పాల్గొన్నారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్


