సంగారెడ్డి జోన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మాదకద్రవ్యాలు, బాలల సంరక్షణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆరు రోజులపాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాలపై పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య పరచాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ న్యాబ్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ప్రసాద్‌రావు, షీ టీం ఎస్‌ఐ పూలబాయి, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి పాల్గొన్నారు. కాగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఎస్పీ పరితోష్ పంకజ్


