పోలీసుల చెంత తప్పిపోయిన బాలుడు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల చెంత తప్పిపోయిన బాలుడు

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

పటాన్‌చెరు టౌన్‌: తప్పిపోయి ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంద్రేశం మున్సిపల్‌ పరిధిలోని రామేశ్వరంబండ నవ్య వెంచర్‌ సమీపంలో ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల బాలుడు ఒంటరిగా తిరుగుతుండటంతో అక్కడ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెళ్లి బాలుడిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. కాగా బాలుడికి సంబంధించిన తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఉంటే పటాన్‌చెరు పోలీసులను సంప్రదించాలని సూచించారు.

గుర్తుపడితే సమాచారం ఇవ్వండి

Advertisement
 
Advertisement
Advertisement