అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

వెల్దుర్తి(తూప్రాన్‌): అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని మానెపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జాల రాజయ్యకు జాల నర్సమ్మ(50), నాగమణి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య నర్సమ్మకు భర్త, నాగమణితో తరచూ గొడవలు జరుగుతున్నాయి. పొలం అమ్మకం విషయంలో తరచూ దాడి చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతుండేవారు. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లో ఉండే రెండో భార్య నాగమణి మానెపల్లికి రావడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, రాజయ్య తన మొదటి భార్య కూతురు లావణ్య భర్తకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆస్తి విషయంలో తరచూ గొడవలు జరుగుతుండడంతో వారు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం నర్సమ్మ తన ఇంట్లోనే అనుమానాస్పదస్థితిలో శవమై కనిపించింది. తన తల్లి నర్సమ్మను తండ్రి రాజయ్య, చిన్నమ్మ నాగమణి హత్య చేశారని మృతురాలి కూతురు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బావిలో యువకుడి మృతదేహం..

జోగిపేట(అందోల్‌): పట్టణ శివారులోని బావిలో సోమవారం యువకుడి మృతదేహం కనిపించింది. పోలీసుల వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన మేసీ్త్ర పనిచేసుకునే భరత్‌ (40) హైదరాబాద్‌లో మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం అతడు స్వగ్రామమైన జోగిపేటకు వచ్చి పనులు చేసుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి సోమవారం బావిలో శవమై తేలాడు. మృతుడి కడుపుపై గాయాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు బావిలో నుంచి మృతదేహాన్ని వెలికి తీసి జోగిపేట ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

భర్త, రెండో భార్య కలిసి

హత్యచేశారని ఆరోపణలు

Advertisement
 
Advertisement
Advertisement