జహీరాబాద్ టౌన్: పట్టణంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ.వినయ్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. పట్టణ సమీపంలో గల పాత ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కర్నాటక బీదర్‌కు చెందిన జంతే అభిషేక్, కాంబ్లే ఆకాశ్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లు బైక్‌పై వెళ్తూ.. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. బైక్ డాక్యుమెంట్ కోసం విచారించగా దొంగతనం చేసినట్లు గుర్తించారు. ఈ నెల 7,8 తేదీల్లో పట్టణంలో నాలుగు వాహనాలు చోరీ చేసినట్లు అంగీకరించారు. బైక్‌లను స్వాధీనం చేసుకొని, నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బైకులను యజమానులకు ఇచ్చినట్లు తెలిపారు. దొంగలను పట్టుకున్న ఐడీ పార్టీ కానిస్టేబుల్ నర్సింహులు, అస్లాం, ఓందేవ్, పృథీరాజ్‌లను అభినందించారు.
నాలుగు బైకులు స్వాధీనం


