మోతాదుకు మించి వాడొద్దు | - | Sakshi
Sakshi News home page

మోతాదుకు మించి వాడొద్దు

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

వట్‌పల్లి(అందోల్‌): మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడొద్దని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్‌ అన్నారు. సోమవారం అందోల్‌ మండలంలోని పోసానిపేటలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువుల వాడకం తగ్గింపు, సమతుల్య ఎరువులు, సాగునీటి పొదుపు, సేంద్రియ వ్యవసాయ విధానం వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పించారు. అవసరం మేరకు రసాయనాలను వినియోగించడం వల్ల నేల సారాన్ని కాపాడుకోవచ్చన్నారు. రైతులు ఎరువుల దుకాణాల్లో కొనుగోలు చేసిన విత్తనాల రశీదు తీసుకోవాలని, పంట పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలన్నారు. పంట మార్పిడిని పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డా.వి హేమలత, డా.ఎ.నిర్మల, డా.కే అరుణ, డా.పి.శ్రీ రంజిత, డా.ఎస్‌ శ్రీదేవి, డా.ఎండీ లతీఫ్‌ పాష, వ్యవసాయ సహాయ సంచాలకులు రమాదేవి, మండల వ్యసాయాధికారి శ్రీహరి, ఏఈఓలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల వాడకంపై అవగాహన

జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement