ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ముస్కాన్ డ్రీమ్స్ క్రియేటివ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెల్స్ ఫార్గో సహకారంతో హైదరాబాద్‌లో కేశవ మెమోరియల్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన అంతర్ జిల్లా ఏఐ సాక్ష్యం హ్యాకథాన్ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయని, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డును దామరకుంట ప్రభుత్వ పాఠశాల, బెస్ట్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో చిన్నకోడూర్, బెస్ట్ ఎఫెక్టీవ్ కమ్యూనికేషన్‌లో చంద్లపూర్ ప్రభుత్వ పాఠశాలలు ఎంపికై నట్లు శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో సుమారుగా 120 పాఠశాలలకు 10 ఉన్నత పాఠశాలలు ఎన్నికై నట్లు తెలిపారు. చిన్నకోడూర్ విద్యార్థులు రైతులు పొలానికి నీటిని పారించే విధానం, చంద్లపూర్ విద్యార్థులు ఫేక్ డీప్ వీడియోలు అండ్ పిక్చర్స్ వల్ల వచ్చే నష్టాలు, దామరకుంట విద్యార్థులు కూరగాయలను రైతులు సులభంగా ఏ విధంగా సేకరించాలో వివరించారు. కార్యక్రమంలో ప్రతి పాఠశాల విద్యార్థులు తమ నూతన ఆవిష్కరణలు, క్రియేటివిటీని, ప్రాబ్లం సాల్వింగ్ టెక్నిక్, క్రిటికల్ థింకింగ్, ఊహాత్మక నైపుణ్యాలు ద్వారా చాలా చక్కగా ప్రజెంటేషన్ చేశారు.


