బస్సును ఢీకొట్టిన డ్రిల్లింగ్‌ వాహనం | - | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొట్టిన డ్రిల్లింగ్‌ వాహనం

Apr 27 2026 8:36 AM | Updated on Apr 27 2026 8:36 AM

నర్సాపూర్‌: స్థానిక బస్టాండులోకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును బోరు డ్రిల్లింగ్‌ వాహనం ఆదివారం ఢీకొట్టింది. వివరాలు ఇలా... గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం మధ్యాహ్నం గజ్వేల్‌ నుంచి సంగారెడ్డి వెళ్తూ స్థానిక బస్టాండులోకి వెళ్తేందుకు టర్న్‌ అవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన బోరు డ్రిల్లింగ్‌ వాహనం బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బస్సు వెళ్లి రోడ్డు పక్కన ఉన్న పలు చిరు వ్యాపారుల దుకాణాలు , పార్కు చేసిన బైక్‌లను ఢీకొట్టడంతో అవన్నీ ధ్వంసమయ్యాయి. గాయాలైన ప్రయాణికులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ విషయమై స్థానిక ఎస్‌ఐ రంజిత్‌రెడ్డిని వివరణ కోరగా.. ప్రమాదం జరిగిన సమాచారం రాగానే తమ సిబ్బందిని పంపినట్లు చెప్పారు. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement