గౌరారం రైతుల వినతి
వర్గల్(గజ్వేల్): ఎండుముఖం పడుతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు విడుదల చేయాలని మండలంలోని గౌరారం రైతులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సంగారెడ్డి కెనాల్ గౌరారం వద్ద కాలువలో అడుగంటిన నీటిని చూపుతూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలం గోదావరి జలాల ఆశతో వివిధ పంటలు సాగుచేశామని, వరిపైరు పొట్టదశకు చేరిందన్నారు. ఈ కీలక తరుణంలో కాలువలో నీళ్లు అడుగంటి ఎండిపోయే పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రభుత్వం గోదావరి జలాలు విడుదల చేసి సాగుచేసిన పంటలు ఎండిపోకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గౌరారం సర్పంచ్ కనకరాజుగౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


