అక్రమ పార్కింగ్‌పై చర్యలేవీ? | - | Sakshi
Sakshi News home page

అక్రమ పార్కింగ్‌పై చర్యలేవీ?

Apr 27 2026 8:36 AM | Updated on Apr 27 2026 8:36 AM

జిన్నారం (పటాన్‌చెరు): రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు నిలుపడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి పారిశ్రామికవాడలోని గ్రాన్‌ విల్స్‌ పరిశ్రమకు చెందిన వాహనాలు రోడ్డుపైనే పార్క్‌ చేయడంతో ప్రయాణికులు వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ అక్రమ పార్కింగుతో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. పరిశ్రమ తీరు మారకపోవడమే కాకుండా అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు, వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అక్రమ పార్కింగుపై చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement