మనస్తాపంతో భర్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో భర్త ఆత్మహత్య

Apr 27 2026 8:36 AM | Updated on Apr 27 2026 8:36 AM

పాపన్నపేట(మెదక్‌): దంపతుల మధ్య జరిగిన గొడవతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని యూసుఫ్‌పేటలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎర్ర అశోక్‌ (30) నాగిరెడ్డిపేట మండలం మాలతుమ్మెద నుంచి యూసుఫ్‌పేటకు ఐదేళ్ల క్రితం ఇళ్లరికం వచ్చాడు. భార్య లక్ష్మి, కొడుకుతో జీవిస్తున్నాడు. శనివారం బయటకు వెళ్లిన అతడు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఇలా తిరిగితే ఎలా అంటూ భార్య నిలదీసింది. దీంతో మనస్తాపం చెందిన అశోక్‌ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే అతన్ని అంబులెన్స్‌లో మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement