● కూటిగల్ స్తూపానికి నిధుల మంజూరు
● భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి
మద్దూరు(హుస్నాబాద్): సీఎం రేవంత్‌రెడ్డి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం దూల్మిట్ట మండలంలోని కూటిగల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాపాలనలో నిలువనీడలేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు పథకం ఎంతో దోహద పడుతుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూటిగల్ గ్రామం నుంచి 28 మంది అమరులయ్యారని, వారి జ్ఞాపకార్థంగా ఉన్న అమరవీరుల స్తూపం అభివృద్ధికి తన సొంత నిధుల నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ధన్వంతి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండల్‌రెడ్డి, జాలపల్లి సర్పంచ్ కమలాకర్ యాదవ్, సర్పంచ్‌లు బాలకృష్ణ, కనుకచంద్రం, రూపేష్, జిల్లా నాయకులు రఘువీరారెడ్డి, మాజీ సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.


