కాలుష్య జలాలపై పోరాటానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

కాలుష్య జలాలపై పోరాటానికి సిద్ధం

Apr 27 2026 8:36 AM | Updated on Apr 27 2026 8:36 AM

జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజిపల్లి ధర్మ చెరువు పరిరక్షణకు గ్రామస్తులు పోరాటానికి సిద్ధమయ్యారు. ఆదివారం గ్రామస్తులు అంతా సమావేశం ఏర్పాటు చేసుకొని కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటానికి తీర్మానం చేశారు. ఇటీవల చెరువులో రసాయన వ్యర్థ జలాలు చేరడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. గండి చెరువు ఎఫ్‌టీఎల్‌ తగ్గించడం, వ్యర్థ జలాల విడుదలపై ఇరిగేషన్‌, సనత్‌నగర్‌ పీసీబీ కార్యాలయంలో ఫిర్యాదు, జీఎంఆర్‌ కాలనీకి మంచినీటి సరఫరాకు తీర్మానించారు. చెరువులు, పంట పొలాలను పరి రక్షించేందుకు సాగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ భార్గవ్‌, నాయకుడు దండే రమాకాంత్‌, గ్రామస్తులు సత్తయ్య, భీమయ్య, జనార్దన్‌, శ్రీను, శ్రావణ్‌, నాగరాజు, వీరయ్య, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement