ఘనంగా వాసవీమాత జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వాసవీమాత జయంతి

Apr 27 2026 8:30 AM | Updated on Apr 27 2026 8:30 AM

సంగారెడ్డిలో తోపాజి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ పట్టు వస్త్రాలు సమర్పించిన టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి జోగిపేటలో కలశాలతో అమ్మవారి ఊరేగింపు

సంగారెడ్డి/ సంగారెడ్డి జోన్‌/జోగిపేట(ఆందోల్‌): రాష్ట్ర ప్రభుత్వం వాసవీకన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా ప్రకటించడంతో ఆదివారం జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్‌లో వాసవీ మాత చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్‌, సభ్యులు తోపాజిఅనంత్‌ కిషన్‌, పూర్ణచందర్‌, నామా భాస్కర్‌, జూలకంటి మల్లేశం, పుల్లూరి ప్రకాష్‌, చందా శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సంగారెడ్డి పట్టణంలో తోపాజి అనంత కిషన్‌ ఆధ్వర్యంలో వాసవీకన్యకాపరమేశ్వరి జయంతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్‌ కలెక్టరేట్‌ మీదుగా పాత బస్టాండ్‌ నుంచి వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సంగారెడ్డి తహసీల్దార్‌ జైరాం నాయక్‌ అమ్మవారికి పూజలో పాల్గొన్నారు.

జోగిపేటలో...

జోగిపేట పట్టణంలో వాసవీకన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 108 కలశాలతో ఆర్యవైశ్య సంఘం నుంచి మధ్యరంగం, గౌని, పోచమ్మ గుడి, హనుమాన్‌ చౌరస్తా, బసవేశ్వరుని విగ్రహం మీదుగా వాసవీ కళ్యాణ మండపం వరకు ఊరేగింపు నిర్వహించారు. మహిళలు కలశాలు పట్టుకుని ఒకే రంగు చీరలను ధరించి అమ్మవారిని ఊరేగించారు.

పోలీసు కార్యాలయంలో...

సంగారెడ్డి జోన్‌: పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మ వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు డానియెల్‌, రాజశేఖర్‌రెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement