కలెక్టర్‌గా ప్రతీక్‌ జైన్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌గా ప్రతీక్‌ జైన్‌ బాధ్యతల స్వీకరణ

Apr 27 2026 8:30 AM | Updated on Apr 27 2026 8:30 AM

సంగారెడ్డి జోన్‌: జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రతీక్‌ జైన్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ప్రావీణ్య ఆర్‌ అండ్‌ బీ శాఖ ప్రత్యేకాధికారిగా బదిలీ అయ్యారు. నారాయణపేట కలెక్టర్‌గా పనిచేసిన ప్రతీక్‌జైన్‌ను సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేయటంతో కలెక్టరేట్‌లో బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్‌కు వచ్చిన ప్రతీక్‌జైన్‌కు అదనపు కలెక్టర్‌ మాధురి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్‌ మాట్లాడుతూ..ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

ఆకట్టుకుంటున్న

హస్తకళ మేళా

సంగారెడ్డి: సంగారెడ్డిలోని టీటీడీ కల్యాణ మండపంలో అఖిలభారత, హస్తకళా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించిన చేనేత హస్తకళ మేళాకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ మేళాలో ఆయుర్వేద ఉత్పత్తులు, డ్వాక్రా ఉత్పత్తులు, వన్‌ గ్రామ్‌గోల్డ్‌ ఉత్పత్తులు, కొండపల్లి, వేటికొప్పాక బొమ్మలు, నిర్మల్‌ హైదరాబాద్‌ మంచి ముత్యాలు, మైసూర్‌ రోజ్‌హుడ్‌, సహార న్‌ పూర్‌ ఫుడ్‌ కార్వింగ్‌ వరంగల్‌ చెవర్‌, జూట్‌ బ్యాగులు, బంజారా ఎంబ్రాయిడరీ, బెంగాల్‌ జ్యూరీ బ్యాక్స్‌లు ప్రదర్శనకు ఉంచారు. వీటితోపాటు పోచంపల్లి, నారాయణపేట, వరంగల్‌, ఉప్పాడ, కంది, ధర్మవరం, సిద్దిపేట, పొందూ రు, వెంకటగిరి, మంగళగిరి చీరలు, చేనేత కాటన్‌, పట్టువస్త్రాలు, టవల్స్‌, చేనేత దుప్ప ట్లు, కర్టెన్లు, ఖాదీ మెటీరియల్స్‌ కూడా అమ్మకానికి ఉంచారు. ఆదివారం సెలవు రోజు కావడంతో టీటీడీ కల్యాణ మండపం కళకళలాడింది.

దుర్గమ్మా.. దీవించమ్మా

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయల జనసంద్రంగా మారింది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం పోసి, బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు చేపట్టారు.

ఫుట్‌బాల్‌ పోటీల్లో రాణించాలి

గజ్వేల్‌రూరల్‌: రాష్ట్రస్థాయిలో జరుగుతున్న ఫుట్‌బాల్‌ పోటీల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గణేష్‌ అన్నారు. రాష్ట్రస్థాయి జూనియర్‌ బాలికల పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఆదివారం గజ్వేల్‌లో జెర్సీలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27 నుంచి 29 వరకు మంచిర్యాల జిల్లా రామకిష్టాపూర్‌ టాగోర్‌ ఫుట్‌బాల్‌ స్టేడియంలో రాష్ట్రస్థాయి జూనియర్స్‌ గరల్స్‌ ఫుట్‌బాల్‌ పోటీలు జరుగనున్నాయని తెలిపారు.

మహనీయులను మరవొద్దు

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ వెంకటయ్య

మిరుదొడ్డి(దుబ్బాక): ఆర్థిక, స్వేచ్ఛా సమానత్వం కోసం పోరాడిన మహనీయులను మరవొద్దని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ నెల 30న దుబ్బాక మండలం చీకోడ్‌ గ్రామంలో నిర్వహించే మహనీయుల ఉత్సవ సభ కరపత్రాలను ఆదివారం అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహనీయులను గుర్తు చేసు కోవడం శుభపరిణామమన్నారు. మహనీయు లు కలలుగన్న ఆశయాలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. మహ నీయుల జీవిత చరిత్రను తెలుసుకోవడానికి చీకోడ్‌లో చేపట్టిన బృహత్‌ కార్యక్రమానికి కవు లు, కళాకారులు, మేధావులు, అభిమానులు హాజరవ్వాలని పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement