సంగారెడ్డి: రేణుక ఎల్లమ తల్లి నాలుగో వార్షికోత్సవం చౌటకూరులో ఆదివారం ముగిశాయి. ముగింపు రోజైన ఆదివారం రేణుక ఎల్లమ్మ తల్లి జమదగ్ని మహర్షి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో సాయంత్రం వేళ పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఉత్సవాలను తిలకించేందుకు పోసానిపల్లి, సరాప్పల్లి, సుల్తాన్పూర్, ఉప్పరిగూడెం, కోర్పోలు తదితర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, ఎంపీపీ మాజీ అధ్యక్షుడు భూంరెడ్డి సుభాష్‌రెడ్డి, జోగిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్, సర్పంచ్ పార్క్‌ల రాంరెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


