గూడెం మహిపాల్‌రెడ్డిని పరామర్శించిన హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు
పటాన్‌చెరు టౌన్: ఇటీవల తన కార్యాలయంలో జారిపడి, స్వల్ప గాయాలకు గురై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని శనివారం సాయంత్రం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తన సహచర ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌లతో కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ...పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం తపనపడే మహిపాల్‌రెడ్డి త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని ఆయన ఆకాక్షించారు. గూడెంను పరామర్శించిన వారిలో బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, సీనియర్ నాయకులు బాల్‌రెడ్డి, మెట్టు కుమార్‌యాదవ్, పాండురంగారెడ్డి, విజయ్కుమార్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


