సంగారెడ్డి టౌన్: కోర్టుల ద్వారానే కేసులు చట్టపరంగా పరిష్కారమవుతాయని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నంద, జస్టిస్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో ఫస్ట్ క్లాస్ కోర్టును శనివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వివాదాలు ఉన్న వారు కోర్టులను సద్వినియోగం చేసుకుని సమస్యల్ని పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర, ఎస్పీ పరితోశ్ పంకజ్, కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తులు
జస్టిస్ నంద, జస్టిస్ అనిల్‌కుమార్


