రైతుల సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే ధ్యేయం

Apr 26 2026 4:57 AM | Updated on Apr 26 2026 4:57 AM

కల్హేర్‌(నారాయణఖేడ్‌): రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. కల్హేర్‌, కృష్ణాపూర్‌, మార్డిలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధాన్యం విక్రయించేందుకు నాణ్యత పాటించాలన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. మార్డిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శివశ్రీనివాస్‌, ఏపీఎం వంశీకృష్ణా, మాజీ సీడీసీ చైర్మన్‌ నర్సింహరెడ్డి, సర్పంచ్‌లు కొడి గంగారం, గోవింద్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎకై ్సజ్‌ ఎస్సైకు రివార్డు

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ ఎకై ్సజ్‌ ఎస్సై మురళీ ఉన్నతాధికారుల నుంచి రివార్డు అందుకున్నారు. గతేడాది అక్టోబర్‌లో గోవా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 47 కిలోల నిషేధిత మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. ఆయన సేవలను గుర్తించి ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టర్‌ షానవాజ్‌ ఖాసీమ్‌ మురళీకి రూ.25వేల నగదు రివార్డును అందజేసి ప్రశంసించారు.

ముగిసిన శిక్షణా తరగతులు

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): న్యాల్‌కల్‌లో వారంరోజులుగా నిర్వహిస్తున్న జనగణన శిక్షణా తరగతులు శనివారం ముగిశాయి. వచ్చే నెల 11 నుంచి నిర్వహించనున్న జనగణనకు సంబంధించి రెండు విడతలుగా శిక్షణా తరగతులు నిర్వహించారు. మొదటి విడతలో 60 మంది, రెండవ విడతలో 56 మంది చొప్పున మొత్తం 116 మంది పాల్గొన్నారు. అందులో 16 మంది సూపర్‌వైజర్లు, 92 మంది ఎన్యూమరేటర్లు, ఎనిమిది మంది ఇతరులు శిక్షణ పొందారు. జనగణనలో ఎలాంటి పొరపాట్లు లేకుండా యాప్‌లో వివరాలను ఎలా నమోదు చేయాలనే విషయాలపై శిక్షకులు వెంకట్‌రెడ్డి అవగాహన కల్పించారు.

సంక్షేమ పథకాలు

ప్రజలకు వివరించాలి

సంగారెడ్డి జోన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని యువజన కాంగ్రెస్‌ విభాగం రాష్ట్ర కో ఇన్చార్జ్‌ భవ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో శనివారం జరిగిన యువజన కాంగ్రెస్‌ విభాగం జిల్లా స్థాయి సమీక్షకు జిల్లా ఇన్చార్జి అబ్దుల్‌ అమీర్‌, జిల్లా అధ్యక్షుడు నరేష్‌గౌడ్‌తోపాటు ఆమె హాజరై మాట్లాడారు. రాబోయే పరిషత్తు ఎన్నికల్లో యువత కీలకపాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బల్వంత్‌రెడ్డి, వసిం, ప్రధాన కార్యదర్శులు గోవర్ధన్‌రెడ్డి, అక్బర్‌, శ్రీహరిగౌడ్‌, మల్లేష్‌యాదవ్‌, అసెంబ్లీ అధ్యక్షుడు వెంకట్‌ జింగా తదితరులు పాల్గొన్నారు.

‘పేదలు ఆత్మగౌరవంతో

బతకాలి’: మంత్రి దామోదర

రేగోడ్‌(మెదక్‌): పేదలు సొంతింటిలో ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నా రు. శనివారం మండల కేంద్రంలో పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాల్లో ఆయన పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం రేగోడ్‌లోని లబ్ధిదారుడు మహేశ్‌ నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement