హత్నూర(సంగారెడ్డి): రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి స్పష్టం చేశారు. హత్నూరలోని ఐకేపీ, సొసైటీ, సిరిపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన తర్వాత వెంటనే తూకం వేసి కొనుగోలు చేయాలన్నారు. ఎలాంటి షరతుల్లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పారు. అవసరమున్న గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు కోరారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రాజశేఖర్, సొసైటీ ఈవో శ్రీనివాస్, సర్పంచ్ నల్లుల్ల ఎల్లయ్య, పలు గ్రామాల నాయకులు, మహిళా సంఘాల సభ్యులు తదితరలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి


