సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ నియమితులయ్యారు. నారాయణపేట కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ని సంగారెడ్డికి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన ప్రావీణ్య రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ బదిలీలు జరిగాయి. ప్రతీక్ జైన్ 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.
పాలనపై ప్రావీణ్య తనదైన ముద్ర
ప్రావీణ్య జిల్లా కలెక్టర్‌గా 2025 జూన్ 13న బాధ్యతలు తీసుకున్నారు. పనిచేసిన పది నెలల్లోనే ప్రావీణ్య జిల్లా పాలనపై తనదైన ముద్ర వేసుకున్నారు. నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలతో జిల్లా అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టారు. తరచూ సమీక్షలు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో జిల్లాను ముందు వరుసలో నిలపగలిగారు. అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన రెవెన్యూ శాఖను కొంతమేరకు గాడిలో పెట్టగలిగారు. భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైన పలువురు తహసీల్దార్‌లను సస్పెండ్ చేయడం, బదిలీ వేటు వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎస్‌ఆర్ నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టారు. ఈ నిధుల వినియోగంపై పర్యవేక్షణకు పలు శాఖల జిల్లా ఉన్నత అధికారులతో కమిటీలు వేసి ఈ నిధులు స్థానిక ప్రజల అవసరాలకు వినియోగం అయ్యేలా ప్రత్యేక చొరవ చూపారు.
ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శిగా ప్రావీణ్య


