సమ్మె వీడి.. విధుల్లో చేరి | - | Sakshi
Sakshi News home page

సమ్మె వీడి.. విధుల్లో చేరి

Apr 26 2026 4:57 AM | Updated on Apr 26 2026 4:57 AM

ఆర్టీసీ కార్మికుల సంబరాలు

సంబరాలు చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగులు

సంగారెడ్డి/జహీరాబాద్‌టౌన్‌: సమస్యల పరిష్కారం కోసం మూడు రోజుల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ ఉద్యోగులు శనివారం తిరిగి విధుల్లో చేరి బస్సులను రోడ్లెక్కించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ఒప్పుకుని సమ్మె విరమణ చేయడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో సంగారెడ్డి, జహీరాబాద్‌, రామచంద్రాపురం, నారాయణఖేడ్‌లలో కార్మికులు శుక్రవారం టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఆయా డిపోల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జాక్‌ కన్వీనర్‌ పల్లె కష్ణమూర్తి, డీఎం.స్వామి, కార్మిక సంఘం నాయకులు మానిక్‌, నర్సింహులు, చంద్రప్ప, సుందర్‌రాజ్‌, మల్లికార్జున్‌, శ్రీనివాస్‌, హన్మయ్య,నరేందర్‌తోపాటు పలువురు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement