ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచాలి

Apr 25 2026 9:24 AM | Updated on Apr 25 2026 9:24 AM

ములుగు ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి

ములుగు(గజ్వేల్‌): హార్టికల్చర్‌(ఉద్యానవన)పంటల ఉత్పత్తిని పెంచడంలో, నాణ్యతను మెరుగుపరచడంలో ఇన్‌పుట్‌ మేనేజ్‌మెంట్‌ కీలక పాత్ర పోషిస్తుందని ములుగు కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్‌ రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వర్సిటీలో రెండో రీసెర్చ్‌ ఎక్స్‌టెన్షన్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ... రైతులకు వాతావరణ ఆధారిత ఆగ్రో సలహాలను అందించాల్సిన అవసరముందన్నారు. ఈ సమావేశంలో పరిశోధన, విస్తరణ రంగాల మధ్య సమన్వయం బలోపేతం చేసి రైతులకు ఉపయోగరమైన సాంకేతిక పరిజ్ఞానం అందచేయడంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనంతరం రీసెర్చ్‌ డైరెక్టర్‌ లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. గత సంవత్సరంలో చేపట్టిన పరిశోధనల పురోగతి, మామిడి మల్పార్మేషన్‌ సమస్య, ప్రూట్‌ బ్యాగింగ్‌ పద్ధతులు, పాక్లోబుట్రాజోల్‌ ప్రభావం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ హార్టికల్చర్‌ౖ డెరెక్టర్‌ బాబు, ఐసీఏఆర్‌ అటారి డైరెక్టర్‌ షేక్‌ ఎన్‌.మీరా, ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులు, సెరికల్చర్‌, ఆర్‌ఈసీ, బోర్డు మేనేజ్‌మెంట్‌ సభ్యులు, మార్కెటింగ్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు. కాగా హార్టికల్చర్‌కు సంబంధించిన కోర్సులు, పరిశోధన, విద్యా కార్యక్రమాలు పూర్తిగా ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు వీసీకి వినతి పత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement