జ్ఞానంతోపాటు నైపుణ్యం ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

జ్ఞానంతోపాటు నైపుణ్యం ముఖ్యం

Apr 25 2026 9:24 AM | Updated on Apr 25 2026 9:24 AM

జిల్లా అదనపు కలెక్టర్‌ పాండు

సంగారెడ్డి జోన్‌: ప్రస్తుత పోటీ ప్రపంచంలో పాఠ్యపుస్తకాల జ్ఞానంతో పాటు నైపుణ్యాల అభివృద్ధి ఎంతో అవసరమని జిల్లా అదనపు కలెక్టర్‌ పాండు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిని కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, టెక్నికల్‌ నైపుణ్యం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వంటి అంశాలు జీవితంలో ముందుకు తీసుకెళ్తాయన్నారు. విజయం ఒక్కరోజులో సాధ్యం కాదని, నిరంతర శ్రమ, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ అఖిలేశ్‌ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రామాచారి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్‌, డైరెక్టర్‌ రాజేశ్‌ కుమార్‌, ట్రైనర్‌ అరవింద, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనర్‌ కె. కష్ణ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement