కేంద్ర మంత్రికి ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రికి ఆహ్వానం

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ పట్టణంలో మే 1న ప్రారంభం కానున్న రేణుకా ఎల్లమ్మ జాతరకు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషన్‌రావు ఆహ్వానించారు. ఈమేరకు శుక్రవారం కరీంనగర్‌లో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ సునీతకు, సంగారెడ్డి అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆకునూరి చంద్రశేఖర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు తాటికొండ పరమేశ్వర్‌ శర్మ, రామక సతీశ్‌శర్మ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement