 
															డీజిల్ దొంగల ముఠా అరెస్ట్
రిమాండ్‌కు తరలింపు
పెద్దశంకరంపేట(మెదక్): రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాల నుంచి డీజిల్ చోరీకి పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి గురువారం తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సబావత్ రాహుల్(వనపర్తి), కురుమ గణేష్(కామారెడ్డి), తోకల నాగరాజు(మహబూబ్‌నగర్)లు జల్సాలకు అలవాటు పడ్డారు. ఈ మేరకు డబ్బును సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఓ కారును అద్దెకు తీసుకొని డీజిల్‌ను దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఇలా దొంగలించిన డీజిల్‌ను హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన అన్వర్‌కి అమ్ముతున్నారు. ఈ నెల 25న పెద్దశంకరంపేటలో నారాగౌడ్‌కు చెందిన లారీల్లో 150 లీటర్ల డీజిల్‌తో పాటు గోదాం తాళంను పగలగొట్టి బ్యాటరీ, లారీ జాక్‌ను ఎత్తుకెళ్లి విక్రయించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమనాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని విచారించగా దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. అన్వర్ పరారీలో ఉండగా.. మిగతా ముగ్గురినిఅరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
