
నిర్వాసితులపై కేసు కొట్టివేత
హర్షం వ్యక్తం చేస్తున్న గౌరవెల్లి భూ నిర్వాసితులు
అక్కన్నపేట(హుస్నాబాద్): భూ నిర్వాసితులపై నమోదైన కేసును సిద్దిపేట జిల్లా కోర్టు కొట్టివేసింది. 2022లో అప్పటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట గౌరవెల్లి భూ నిర్వాసితులు ఆందోళన చేయగా.. 17మందిపై కేసు నమోదైంది. అందులో నలు గురు నిర్వాసితులైన తిరుపతిరెడ్డి, శంకర్‌రెడ్డి, రాగి శ్రీనివాస్ తదితరులు 42 రోజులు జైలులో ఉండి కండీషన్ బెయిల్‌పై వచ్చారు. మూడేళ్లుగా ఈ కేసు సిద్ది పేట జిల్లా కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు. కాగా, సరైన సాక్ష్యాలు లేని కారణంగా భూ నిర్వాసితులపై నమోదైన కేసును కొట్టివేసినట్లు న్యాయమూర్తి తెలిపా రు. దీంతో భూ నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు.