
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సంగారెడ్డిటౌన్: జిల్లాలో కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈత, తాటి చెట్లపై నుంచి పడి మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించాలన్నారు. అక్రమ మద్యం, బెల్ట్ షాపులను అరికట్టాలన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన సబ్సిడీ రుణాలను వెంటనే మంజూరు చేయాలని, సొసైటీలలో సభ్యులుగా ఉన్నవారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. సమస్యలపై అనేకసార్లు అధికారులు, మంత్రులకు తెలియజేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి రమేష్గౌడ్, సంగారెడ్డి మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.