
న్యాయ సేవలు మరింత విస్తృతం: కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: జిల్లాలో బాధిత మహిళలకు న్యాయ సహాయ సేవలు మరింత విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం మహిళా సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మిషన్ వాత్సల్య ద్వారా బాలల సంక్షేమం, దత్తత ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆహారం, విద్య, ఆరోగ్య పరిరక్షణపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లకు అందుతున్న సేవలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, సీడీపీఓలు చంద్రకళ, జయరామ్, ప్రియాంక, అంజమ్మ, సుజాత, డీసీపీఓ రత్నం, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ సౌమ్య, జిల్లా మహిళ సాధికారత కోఆర్డినేటర్ పల్లవి, సఖి కేంద్రం కోఆర్డినేటర్ కల్పన, తదితరులు పాల్గొన్నారు.
అతిథి అధ్యాపక పోస్టులకు ఆహ్వానం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలు, కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మెదక్ ఆర్‌సీఓ గౌతంకుమార్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తాత్కాలిక పద్ధతిలో ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, సోషల్, గణితం, హిందీ సబ్జెక్టులను బోధించేందుకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, పీజీ చేసి 50% మార్కులు తగ్గకుండా ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఈ నెల 19న సంగారెడ్డిలోని ఆర్‌సీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9441250450ను సంప్రదించాలన్నారు.
17 కల్లు దుకాణాల
నమూనాల సేకరణ
పటాన్‌చెరు టౌన్: ఐలాపూర్‌లో అనుమతి లేకుండా విక్రయిస్తున్న ఓ కల్లు దుకాణంపై కేసు పటాన్‌చెరు ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నియోజకవర్గ పరిధిలోని పటాన్‌చెరు, అమీన్‌పూర్, రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదలలో మొత్తం 17 కల్లు దుకాణాల నుంచి నమూనాలు సేకరించి నిజామాబాద్ ల్యాబ్‌కు పంపించారు. ఈ మేరకు ఎక్సైజ్ సీఐ పరమేశ్వర గౌడ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.
సిగాచి బాధితులకు రూ.కోటి పరిహారం
సీఐటీయూ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌కు వినతి
మెదక్ కలెక్టరేట్: సిగాచి పరిశ్రమలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం కింద రూ.కోటి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఐటీయూ నేతలు అదనపు కలెక్టర్ నగేశ్‌కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గౌరి మాట్లాడుతూ... సంగారెడ్డి జిల్లా లోని పాశమైలారం ప్రాంతంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రూ.50 లక్షలు, పరిశ్రమ యాజమాన్యం కోటి రూపాయలు వెంటనే ఇవ్వాలన్నారు. బాధిత కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించడంతోపాటు పరిశ్రమల ఇన్‌స్పెక్టర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. ఘటన జరిగి 15 రోజులవుతున్నా ఇప్పటికీ పరిశ్రమ యాజమాన్యంగాని, ప్రభుత్వంగాని బాధితులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లాలో కూడా చాలా పరిశ్రమల్లో రియాక్టర్స్ లేవని, అలాంటి పరిశ్రమలపై చర్యలు చేపట్టాలన్నారు.

న్యాయ సేవలు మరింత విస్తృతం: కలెక్టర్ ప్రావీణ్య

న్యాయ సేవలు మరింత విస్తృతం: కలెక్టర్ ప్రావీణ్య