
రూ.3.34 కోట్లు
వసతుల కల్పనకు
ప్రభుత్వ కళాశాలలు బలోపేతం
● పెరగనున్న ప్రవేశాలు!
న్యాల్‌కల్(జహీరాబాద్): ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యనందించేందుకు సర్కారు దృష్టి సారించింది. ప్రభుత్వ కళా శాలల్లో వసతుల లేమితో విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారని గుర్తించిన ప్రభు త్వం అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది. కళా శాలల్లో పూర్తిస్థాయిలో అధ్యాపకులు నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, విద్యార్థుల హాజరు పర్యవేక్షణ నిమిత్తం రూ.3.34 కోట్ల నిధులు మంజూరు చేసింది.
విద్యార్థుల ఇబ్బందులు దూరం
మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతోపాటు వారెదుర్కొంటున్న ఇబ్బందులు దూరం కానున్నాయి. జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు 48 ప్రైవేట్, ఇతర కళాశాలలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో సరైన సౌకర్యా లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం 17 కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఇటీవల రూ.3.34 కోట్లు మంజూరు చేసింది.
సౌకర్యాలు కల్పిస్తాం
మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం 17 జూనియర్ కళాశాలలకు రూ.3.34కోట్లు విడుదల చేసింది. ఆ నిధులతో భవనాలు, మూత్ర శాలల మరమ్మతులు, డ్యూయల్ డెస్క్‌లు, గ్రీన్ బోర్డులు తదితర సౌకర్యాలు కల్పిస్తాం. ప్రవేశాల ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది. ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగే అకాశం ఉంది.
–గోవింద్‌రావు, డీఐఈఓ–సంగారెడ్డి
ఏ కాలేజీకి ఎన్ని నిధులు
ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైన నిధులు
(రూ.లక్షల్లో)
1) సంగారెడ్డి(బాలికలు) రూ. 10.50
2) సంగారెడ్డి(బాలురు) రూ. 31
3) పుల్‌కల్ రూ. 9.20
4) పటాన్‌చెరువు రూ. 6
5) రామచంద్రపురం(గీతా భూపాల్‌రెడ్డి) రూ. 12.50
6) అందోల్ రూ. 20
7) అందోల్(బాలికలు) రూ. 15
8) సదాశివపేట్ రూ. 21.60
9) కొండాపూర్ రూ. 25
10) జిన్నారం రూ. 21
11) నారాయణఖేడ్ రూ. 28
12) కోహీర్ రూ. 24.50
13) హత్నూర రూ. 11.30
14) హద్నూర్(న్యాల్‌కల్ మండలం) రూ. 29.50
15) న్యాల్‌కల్ రూ. 26.50
16) బుధేరా(మునిపల్లి) రూ. 13.10
17) కంగ్టి రూ. 28.50

రూ.3.34 కోట్లు