
మొక్కవోని దీక్ష
కొల్చారం(నర్సాపూర్): పచ్చని చెట్లతో నిండి ఉపాధ్యాయులు, విద్యార్థులతో కనిపిస్తున్న ఈ ప్రదేశం మండలంలోని వరిగుంతం ఉన్నత పాఠశాల ఆవరణ. ఆరేళ్ల క్రితం హరితహారంలో భాగంగా ఆవరణలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో ఉత్తమ పాఠశాలగా ఎంపికై ంది. మొక్కవోని దీక్షతో ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. పాఠశాల ఆవరణ పచ్చదనంతో నింపాలన్న ఆశయంతో ముందుకు సాగుతామని ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతిన పూనుతున్నారు.
కొల్చారం వరిగుంతం పాఠశాలలో పచ్చని చెట్ల మధ్య విద్యార్థులు, ఉపాధ్యాయులు