
పచ్చని తోరణంలా ద్రాక్ష తీగ
దుబ్బాకటౌన్: ఇంటిని పచ్చని తోరణంలా ఉంచడానికి, ఎండాకాలంలో భవనాన్ని చల్లగా ఉంచడానికి , వాతావరణ కాలుష్యం నుంచి ఉపశమనం పొందడానికి పచ్చని పొదరిల్లుగా తీర్చిదిద్దింది ఓ గృహిణి. దుబ్బాక పట్టణానికి చెందిన కోమలి వినూత్న ఆలోచనతో ఇంట్లో ఉన్న తక్కువ ఖాళీ స్థలంలో ప్రత్యేక ద్రాక్ష మొక్కలను నాటింది. దీంతో వేసవి కాలంలో ఇంట్లోకి ఎండ పడకుండా చల్లగా ఉండేలా ఇంటిముందు ద్రాక్ష తీగలు పందిరిలా అల్లుకుపోయేలా ఏర్పాట్లు చేసింది. ఈ మొక్కలు తీగలా అల్లుకుని చల్లదనంతో పాటు పండ్లను సైతం ఇస్తున్నాయి. ఇంటిపై సైతం మరిన్ని మొక్కలు నాటడానికి ప్రయత్నాలు చేస్తున్నా. ఇంటి ముందే కాకుండా భవనంపై సైతం మొక్కలు నాటడానికి నూతన తరహాలో ఆలోచన చేసింది. భవనంపై ఇటీవల డ్రాగన్, కివీ మొక్కలు నాటింది
ఇంటి ముందు పందిరిలా అల్లుకున్న ద్రాక్ష చెట్టుతో కోమలి