
త్వరలో ఉపాధ్యాయులకు పీఆర్సీ
వర్గల్(గజ్వేల్): ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే పీఆర్సీని సాధించబోతున్నామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వర్గల్ మండలం గౌరారంలో ఓ ఫంక్షన్‌హాల్‌లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన శేరిపల్లి హెచ్‌ఎం కాయిత రమాదేవి ఉద్యోగ విరమణ సభకు హాజరై సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ సాధించుకున్న ఘనత పీఆర్టీయూ సంఘానికే దక్కుతుందన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుండు లక్ష్మణ్, దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, శశిధర్‌శర్మ, మండల పీఆర్టీయూ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈఓలు సునీత, ఉదయభాస్కర్, జిల్లా నాయకులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుభాష్ రెడ్డి, లక్కిరెడ్డి విజయ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి